|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 02:09 PM
తెలంగాణ ఏర్పడిన 42 రోజుల్లోనే కృష్ణా నదిలో 69% నీటి వాటా కోసం కేంద్రానికి కేసీఆర్ లేఖ రాశారని హరీశ్ రావు తెలిపారు. కాంగ్రెస్, టీడీపీల ద్రోహం వల్లే కృష్ణాలో 299 TMCలు వచ్చాయని, అయితే గోదావరిలో 933 TMCలకు అనుమతులు సాధించామని ఆయన పేర్కొన్నారు. సభలో అబద్ధాలు చెప్పినందుకు సీఎం రాజీనామా చేయాలని, రేవంత్ రెడ్డి నాలుక కోయాలని, తనపై దాడి లేదా హత్యాయత్నం చేయించవచ్చని హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.