|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 10:55 AM
సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రధానమంత్రి నరేంద్రమోదీపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య అసెంబ్లీలో అలాంటి మాటలకు స్థానం లేదని, కమ్యూనిస్టు భావజాలం ప్రజాదరణ కోల్పోవడానికి ఇలాంటి బాధ్యతలేని వ్యాఖ్యలే కారణమని ఆయన ఆక్షేపించారు. ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, దేశ ప్రజలకు, ప్రధాని మోదీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.