|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 10:40 AM
పెద్దపల్లి జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో, జిల్లా సబ్ జూనియర్ ఖోఖో జట్టు ఎంపిక కోసం ఈనెల 4వ తేదీన పెద్దపల్లి పల్లవి స్కూల్లో సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు జిల్లా ఖోఖో సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లక్ష్మణ్, డాక్టర్ వేల్పుల కుమార్ తెలిపారు. జిల్లాలోని క్రీడాకారులు ఈ సెలక్షన్ లో పాల్గొనవచ్చని, వారికి భోజన, వసతి సౌకర్యాలను పాఠశాల కరస్పాండెంట్ శోభారాణి ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టుకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.