|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 08:09 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, గ్రూప్-1 పరీక్షల నిర్వహణలో లోపాలు, జీవో 46 బాధితులకు న్యాయం చేయాలని శుక్రవారం మండలిలో డిమాండ్ చేశారు. గ్రూప్-1 పరీక్ష సరిగా జరగకపోవడం వల్ల విద్యార్థులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని, ప్రభుత్వం దీనిపై వైట్ పేపర్ విడుదల చేయాలని కోరారు. JNTUలో మెయిన్స్ మూల్యాంకనం జరిగిందని RTI ద్వారా తెలిసిందని, ఎన్నికల సమయంలో విద్యార్థులను వాడుకుని అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.