|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 11:42 AM
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు. అక్కడ రూ.35.19 కోట్ల టీటీడీ నిధులతో నిర్మించనున్న దీక్ష విరమణ మండపం, సత్రం నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేస్తారు. ఉదయం 10:30 నుండి 11:30 గంటల మధ్య ఈ కార్యక్రమాలు జరుగుతాయని జనసేన పార్టీ వెల్లడించింది. ఈ మండపంలో ఒకేసారి 2,000 మంది దీక్ష విరమణ చేయవచ్చు, అలాగే సత్రంలో 96 విశ్రాంతి గదులు అందుబాటులో ఉంటాయి.