|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 03:09 PM
సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను సబ్ కలెక్టర్ ఎన్. ఉమా హారతి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 8వ తరగతి గదిలోకి వెళ్లి బయాలాజీ సబ్జెక్టుపై విద్యార్థులతో మాట్లాడారు. పాఠాలు అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ అడిగి తెలుసుకోవాలని, నోట్స్ అర్థమయ్యే రీతిలో వ్రాసుకోవాలని, నోటు పుస్తకాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆమెతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాదవరెడ్డి ఉన్నారు.