|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 11:18 AM
సెర్చ్ వారెంట్ల జారీ విధానంపై పూర్తి స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హోం శాఖ దాఖలు చేసిన అఫిడవిట్ అస్పష్టంగా ఉందని, జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌లకు మాత్రమే ఉన్న సెర్చ్ వారెంట్ అధికారాన్ని అసిస్టెంట్ కమిషనర్ హోదా ఉన్న పోలీసు అధికారి ఎలా వినియోగిస్తున్నారో వివరించాలని ప్రశ్నించింది. హైదరాబాద్ సిటీ పోలీసు చట్టం సెక్షన్ 47 చట్టవిరుద్ధమని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు, రెండు వారాల్లో పూర్తి వివరాలతో అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది.