|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 02:49 PM
సోమవారం పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్ డి. వేణుతో కలిసి ప్రజల నుండి సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజావాణి అర్జీలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి, పెండింగ్ లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.