రక్తంతో కేటీఆర్ పెయింటింగ్.. గుండెపై టాటూ! ఖమ్మం యువకుడి అసాధారణ అభిమానం
Wed, Jan 07, 2026, 08:20 PM
|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 06:14 PM
రాజన్న సిరిసిల్ల ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం తంగళ్ళపల్లి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్షేత్ర స్థాయిలో ప్రజలకు అన్ని వ్యాధులపై అవగాహన కల్పించాలని, ఏ.ఎన్.సీ రిజిస్ట్రేషన్లు, ఎన్.సీ.డీ స్క్రీనింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె ఆదేశించారు. గర్భిణీల ఆరోగ్య విషయాలపై దృష్టి సారించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచే విధంగా కృషి చేయాలని, వైద్యులు, సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. సీజనల్ వ్యాధులు, పరిసరాల పరిశుభ్రతపై వివరించాలని తెలిపారు.