|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 01:38 PM
TG: కొండగట్టు ఆలయం తనకు పునర్జన్మనిచ్చిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. గతంలో జరిగిన విద్యుత్ ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డానో ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తోందన్నారు. కొండగట్టు అంజన్నే తనను కాపాడరని గుర్తు చేసుకున్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రంలో దీక్ష విరమణ మండపం, సత్రం పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు.