|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 01:25 PM
పవన్ కల్యాణ్ శనివారం ఉదయం హెలికాప్టర్ లో కొండగట్టు చేరుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆలయానికి వచ్చిన జనసేనానికి అర్చకులు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. అనంతరం అంజన్నకు ప్రత్యేక పూజలు చేశారు.పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కేటాయించిన రూ.35.19 కోట్ల నిధులతో కొండగట్టులో నిర్మించనున్న ధర్మశాల, దీక్ష విరమణ మండపం కోసం భూమి పూజ నిర్వహించనున్నారు. 96 గదులతో ధర్మశాలను నిర్మించనున్నట్లు సమాచారం.భూమి పూజలో పాల్గొన్న తర్వాత నాచుపల్లి శివారులోని రిసార్ట్‌లో జనసేన కార్యకర్తలతో పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.