|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 03:14 PM
మెదక్ మున్సిపాలిటీలో 32 వార్డుల ఓటరు ముసాయిదా జాబితాలో తీవ్ర తప్పిదాలు ఉన్నాయని మాజీ మున్సిపల్ చైర్మన్ అరెల్ల మల్లికార్జున్ గౌడ్ ఆరోపించారు. శనివారం ఆయన మాజీ కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ కమిషనర్‌కు మెమోరండం సమర్పించారు. ఒక వార్డు ఓటర్లు మరో వార్డులో నమోదు కావడం వంటి లోపాలున్నాయని, 2020 తరహాలో డోర్ టు డోర్ సర్వే చేసి జాబితా సిద్ధం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.