|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 10:51 AM
చీటీ డబ్బుల విషయంలో వ్యక్తిని హత్యచేసిన ఘటన JGTL పట్టణంలో జరిగింది. పట్టణ CI కరుణాకర్ ప్రకారం.. నెలవారీ కిస్తీ రూ.12వేలు చెల్లించాలని గోవిందుపల్లెకు చెందిన అంజయ్య, పట్టణానికి చెందిన బాసోజి శ్రీనివాస్‌ను అడిగారు. DEC 31న శ్రీనివాస్, అతని కుమారుడు వేణుచారీలు.. KNR రోడ్డులోని ఓ షోరూం వద్దకు వస్తే ఇస్తానని అంజయ్యను పిలిచి కొట్టి పారిపోయారు. చికిత్సపొందుతూ ఆయన మృతిచెందారు. నిందితులను అరెస్ట్ చేశారు.