|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 02:18 PM
కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద పట్టణాల్లో రాజకీయాలు వేడెక్కాయి. కామారెడ్డిలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. అధికారులు ఓటర్ల జాబితాను విడుదల చేసి, అభ్యంతరాలకు గడువు విధించారు. ఈ నెల 10న తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. పోటీ చేసే అభ్యర్థులు తమ వార్డుల్లో రిజర్వేషన్లు ఎలా వస్తాయోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.