|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 02:42 PM
మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రాన్ని కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు. గజ్వేల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు వ్యవసాయ క్షేత్రం వద్ద నిరసనకు దిగి, కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లి గజ్వేల్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం మాట్లాడాలని, లేదంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీకి రాకుండా గజ్వేల్ ప్రజల ఓట్లు కోరడం, ఫామ్ హౌస్ పాలన వద్దు అంటూ నినాదాలు చేశారు.