|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 10:59 AM
ఏపీ ఉపముఖ్యమంత్రి, నటుడు పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో శనివారం కొండగట్టుకు వచ్చే భక్తులు, ఆయన అభిమానులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. దొంగలు చేతివాటం ప్రదర్శించే ఆస్కారం ఉన్నందున మహిళలు, వృద్ధులతో పాటు, భక్తులు తమ మెడల్లోని బంగారు చైన్లు, సెల్ ఫోన్లు తదితర విలువైన వస్తువులను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని అన్నారు. ఏదైనా ఇబ్బంది తలెత్తితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.