|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 02:10 PM
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు NHAI రీజినల్ రింగ్ రోడ్డు (RRR) పరిధిలో ఇండస్ట్రియల్ పార్కుల నుంచి భారీ వాహనాలను నేరుగా తరలించడానికి 'అండర్‌గ్రౌండ్ కార్గో టన్నెల్స్' నిర్మించాలని యోచిస్తోంది. దీనివల్ల రోడ్డుపై ప్రయాణికుల రద్దీ తగ్గి, భారీ కంటైనర్లు భూగర్భం నుంచే గమ్యస్థానాలకు చేరుకుంటాయి. ఈ ప్రతిపాదన హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ నుంచి ఉపశమనం కలిగించే అవకాశం ఉంది.