|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 03:27 PM
దుర్గం చెరువు ఆక్రమణల వ్యవహారంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. చెరువు స్థలాన్ని ఆక్రమించారన్న ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యేతో పాటు వెంకట్ రెడ్డి అనే వ్యక్తిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. హైడ్రా అధికారుల ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుర్గం చెరువు పరిధిలో దాదాపు ఐదు ఎకరాల స్థలాన్ని కబ్జా చేసినట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. చెరువు ప్రాంతాన్ని మట్టి, రాళ్లతో నింపి చదును చేశారని, అనంతరం ఆ స్థలాన్ని ఎస్‌టీఎస్ (STS) ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ వారికి పార్కింగ్ కోసం అద్దెకు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. ఇలా అక్రమంగా ఆక్రమించిన ప్రభుత్వ భూమి ద్వారా నిందితులు అక్రమ ఆదాయం పొందుతున్నారని హైడ్రా తన ఫిర్యాదులో పేర్కొంది.