|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 03:04 PM
నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులకు ఒక విచిత్రమైన అనుభవం ఎదురైంది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన ఒక యువకుడు పోలీసులపైనే దౌర్జన్యానికి దిగాడు. మద్యం సేవించి వచ్చిన అతను తన బైక్‌ను తిరిగి ఇవ్వాలని పోలీసులతో వాగ్వాదానికి దిగాడు.తన బైక్ తనకు ఇప్పించాలని తలను గోడకేసి బాదుకున్నాడు. బైక్ తాళం చెవి ఇవ్వాలని, లేకపోతే తనకు కోపం వస్తోందని పోలీసులతో అన్నాడు. ఒక పోలీసు అధికారి కాళ్లపై పడ్డాడు. మీ తండ్రి పేరేమిటని అడిగితే, బైక్ సీటుపై చేయితో గట్టిగా కొడుతూ సమాధానం దాటవేశాడు. ట్రాఫిక్ పోలీసులు ఎంత నచ్చజెప్పినా వినకుండా ఏడుస్తూ వారిని ముప్పుతిప్పలు పెట్టాడు.