|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 01:56 PM
బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావును 'గుంటనక్క' అంటూ ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీలో కీలక అంశాలపై చర్చ జరుగుతున్నప్పుడు ప్రతిపక్షం సభను బహిష్కరించడం సరికాదని ఆమె అన్నారు. కేసీఆర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని మాటలు అన్నా హరీష్ రావు ఎప్పుడూ సభను బహిష్కరించలేదని కవిత పేర్కొన్నారు. హరీష్ రావుకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి ఇవ్వగానే బీఆర్ఎస్ పార్టీని ఎవరూ కాపాడలేరని ఆమె వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం అంటే కేవలం పార్టీ మాత్రమే కాదని, ప్రజల గొంతుక అని ఆమె అన్నారు.