|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 02:07 PM
తిరుమలగిరి మండల పరిధిలోని తొండ గ్రామం సమీపంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమలగిరి నుంచి తొర్రూరు వైపు వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ను ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ సతీష్ (45) అక్కడికక్కడే మృతి చెందారు. ఆదివారం స్వగ్రామానికి వెళ్లి తిరిగి విధులకు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన ట్యాంకర్ను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జి. వెంకట్ రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.