|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 07:49 PM
పటాన్‌చెరు పట్టణం మైత్రి మైదానంలో, ఎమ్మెల్యే గూడెం మహాపాల్ రెడ్డి గారి ప్రోత్సాహంతో, ఒమర్ క్లాసిక్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ బిగ్గెస్ట్ బాడీ బిల్డింగ్ షో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు, MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాప్) మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారిని పృథ్వీరాజ్ గారు పుష్పగుచ్ఛం అందజేసి ఆత్మీయంగా కలిశారు.ఈ సందర్భంగా పృథ్వీరాజ్ గారు మాట్లాడుతూ, పటాన్‌చెరు పట్టణంలో రాష్ట్రస్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని. ఈ షో యువతలో క్రీడా ప్రేరణ, శారీరక దృఢత్వం, మరియు స్వీయ అభివృద్ధి కోసం ప్రేరణనిచ్చేలా ఉండడం ముఖ్యమని ఆయన అన్నారు.అలాగే, క్రీడాకారులు సాధన, శ్రద్ధ, ప్రతిభతో తమ సామర్థ్యాన్ని ప్రదర్శించాలనే ఉత్సాహాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని పృథ్వీరాజ్ గారు తెలిపారు. కార్యక్రమంలో అత్యుత్తమ ప్రతిభావంతులైన క్రీడాకారులకు మెడల్స్ మరియు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గూడెం మధు సుధన్ గారు , మార్కెట్ కమీటీ మాజీ చైర్మన్ విజయ్ గారు , మైత్రి క్లబ్ అధ్యక్షులు హనుమంత గారు ,విక్రమ్ రెడ్డి గారు, షకీల్ గారు , ఒమర్ గారు తదితరులు పాల్గొన్నారు.