|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 07:56 PM
పటాన్చెరు : పటాన్చెరు నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పూర్తి పారదర్శకతతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని స్థానిక శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.సోమవారం సాయంత్రం పటాన్చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో.. నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు, మున్సిపాలిటీలు, డివిజన్లకు చెందిన 30 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా మంజూరైన 12 లక్షల 96 వేల రూపాయలు విలువైన చెక్కులను ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెరుగైన వైద్య చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అండగా నిలుస్తున్నామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.