|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 02:16 PM
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావపేట మండలం కొలనూరు గ్రామంలో కట్టచెరువు వద్ద గంజాయి అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. 06.01.2026న సాయంత్రం 04:15 గంటలకు జరిగిన ఈ ఘటనలో, పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించిన నిందితుల వద్ద నుంచి 50 గ్రాముల గంజాయి, ఒక బైక్, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో మాలోత్ వంశీ, బానోత్ ఆనంద్ నాయక్, తమ్మిడి పృథ్వీరాజ్ ఉన్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఎస్సై, కానిస్టేబుల్స్ విశాల్, నాగరాజు, తిరుపతిలను అభినందించారు. గంజాయి అక్రమ రవాణా, వాడకంపై తీవ్ర చర్యలు తీసుకుంటామని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ G. వెంకటేశ్వర్లు తెలిపారు.