|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 06:37 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డికి కనీస పరిజ్ఞానం లేదని, ఏ వాగు ఎక్కడుందో, కృష్ణా, గోదావరి ఏ బేసిన్‌లో ఉన్నాయో కూడా తెలియదని ఆయన ఆరోపించారు. రూ. 6 వేల కోట్ల ఒప్పందం చేసుకుని, రాహుల్ గాంధీకి నెలకు రూ. 100 కోట్లు చొప్పున ముడుపులు చెల్లించడం తప్ప రేవంత్ రెడ్డికి ఏమీ తెలియదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ 420 హామీలిచ్చి ఒక్కటీ అమలు చేయడం లేదు. రాహుల్, రేవంత్‌ను ఉరి తీయాలి. చదువురాని దద్దమ్మ రేవంత్‌రెడ్డి. ఢిల్లీకి డబ్బులు పంపి తన సీఎం సీటును కాపాడుకుంటున్నాడు. కేసీఆర్ ఒక్క ప్రెస్‌మీట్‌కే రేవంత్ లాగు తడిసింది’’ అంటూ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.