|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 09:49 PM
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ శాసనసభ్యులు తోక ముడిచారని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని చెప్పిన ప్రతిపక్షం అసెంబ్లీ నుంచి జారుకుందని ఆయన ఎద్దేవా చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీరాలు పలికారని అన్నారు. సభాపతిని అవమానపరిచేలా వారు వ్యవహరించినందుకు వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.బీఏసీ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు యక్ష ప్రశ్నలు వేశారని అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం సభలో కనిపించడం లేదని విమర్శించారు. శాసనసభలో ముఖ్యమైన అంశాలపై చర్చ జరిగే సమయంలో ప్రధాన ప్రతిపక్ష సభ్యులు గైర్హాజరు కావడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకే ప్రభుత్వం కృష్ణా జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసిందని వెల్లడించారు. ప్రతిపక్షానికి అభ్యంతరాలు ఉంటే సభలో చెప్పాలి కానీ బయట మాట్లాడటమేమిటని ఆయన ప్రశ్నించారు.