|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 06:24 PM
భారతీయ ఎస్‌యూవీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన ప్రతిష్ఠాత్మక 'XUV 7XO'ను దేశీయ మార్కెట్లోకి అధికారికంగా విడుదల చేసింది. గతంలో భారీ విజయం సాధించిన XUV 700కు ఇది అడ్వాన్స్‌డ్ వెర్షన్. దీని ప్రారంభ ధరను రూ. 13.66 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) సంస్థ నిర్ణయించింది. కేవలం పేరు మాత్రమే కాకుండా, డిజైన్, టెక్నాలజీ పరంగా ఈ కారు సరికొత్త అనుభూతిని ఇస్తుంది.XUV 7XO డిజైన్ చూస్తే, పాత మోడల్ పోలికలు ఉన్నప్పటికీ మరింత షార్ప్‌గా, ప్రీమియంగా కనిపిస్తోంది. ముందు భాగంలో కొత్త పియానో బ్లాక్ గ్రిల్, మెరిసే 'టాలోన్' యాక్సెంట్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇక కారు లోపల (ఇంటీరియర్) ఏకంగా మూడు స్క్రీన్ల (31.24 సెం.మీ) లేఅవుట్‌ను ఇచ్చారు. ఇది భారతదేశంలో ఏ పెట్రోల్/డీజిల్ ఎస్‌యూవీలోనూ లేని ప్రత్యేకత. ప్రీమియం లెదర్ సీట్లు, 16-స్పీకర్ల హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, డాల్బీ అట్మోస్ వంటి ఫీచర్లు కారును రోడ్డుపై వెళ్లే ఒక థియేటర్‌లా మార్చేశాయి. ఈ కారులో మహీంద్రా కొత్తగా 'DAVINCI' సస్పెన్షన్ సిస్టమ్‌ను పరిచయం చేసింది. ఇది గుంతల రోడ్లపై కూడా సాఫీగా వెళ్లేలా కారును నియంత్రిస్తుంది.