|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 11:16 AM
TG: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను చంపింది. ఒడిశాకు చెందిన నారాయణ బెహరా(32), బంధిత బెహరా(27) HYD ఓల్డ్ మీర్‌పేట్ శాంతినగర్‌లో ఉంటున్నారు. అయితే ఇంటి పక్కనే ఉన్న బిహార్‌కు చెందిన విద్యాసాగర్‌తో బంధిత ఎఫైర్ పెట్టుకుంది. గురువారం రాత్రి నారాయణ, విద్యాసాగర్ కలిసి మల్లాపూర్‌లోని వైన్స్ వద్ద మద్యం తాగారు. అర్ధరాత్రి ఇంటికొచ్చిన నారాయణకు బంధితకు గొడవ జరిగింది. బంధిత, ప్రియుడితో కలిసి ఇనుపరాడ్డుతో భర్తను తలపై కొట్టడంతో మృతి చెందాడు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.