|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 02:27 PM
రంగారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనవరి 5న ఉదయం 9 గంటలకు ఎల్‌బీ నగర్‌లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో సబ్ జూనియర్ మరియు అండర్ 20 ఇయర్స్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 6 సంవత్సరాలు పైబడిన క్రీడాకారులకు అండర్-8, అండర్-10, అండర్-12, అండర్-14 మరియు 14 నుండి 20 సంవత్సరాల బాల బాలికలకు అండర్ 20 ఇయర్స్ విభాగాల్లో పోటీలు జరుగుతాయి.