|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 03:49 PM
తెలంగాణ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్ ను రంగారెడ్డి జిల్లాకు చెందిన ముదిరాజ్ సంఘం నాయకులు ఆదివారం నాడు కలిశారు. ఈ సందర్భంగా సంఘం ఉపాధ్యక్షుడు చెనమోని శంకర్ ముదిరాజ్, జిల్లా మత్స్య శాఖ కార్పొరేటివ్ ఇంచార్జ్ ఛైర్మన్ దూస వెంకటేష్ ముదిరాజ్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ మరియు ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు జెర్కోని బాల రాజ్ ముదిరాజ్, సంఘం ఉపాధ్యక్షుడు సోప్పరి శ్రీ రాములు, కార్యదర్శి బోళ్ళ మాహేందర్, ఎలమోని రమేష్, చెనమోని బాలగణేష్ తదితరులు మంత్రితో సమావేశమయ్యారు. ఈ సమావేశం రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, మహేశ్వరం ప్రాంతాలలో జరిగింది. ఈ సందర్భంగా వారు మంత్రికి పలు వినతులు సమర్పించినట్లు సమాచారం.