|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 01:54 PM
TG: స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఓ యువతి మృతి చెందింది. బొంబాయి కాలనీకి చెందిన ఉమా మహేశ్వరి(26) స్కూటీపై వెళ్తుండగా ఏలూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో స్పాట్‌లోనే చనిపోయింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా బీహెచ్ఈఎల్ బస్ డిపో వద్ద జరిగింది. కాగా మహేశ్వరి బీరంగూడలో జిమ్ ట్రైనర్‌గా పని చేస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.