|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 08:28 PM
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా, కాగజ్‌నగర్ మండలంలోని ఒక గ్రామం పేరు రెవెన్యూ రికార్డుల్లో 'ల*జగూడ'గా ఉండటంపై సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉచ్చరించడానికి కష్టంగా ఉన్న ఈ పేరుతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికే గ్రామస్తులు పేరును 'నందిగూడ'గా మార్చుకున్నారని, అదే విధంగా రెవెన్యూ రికార్డుల్లో కూడా మార్పు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీలో పలకడానికి ఇబ్బందిగా ఉన్న ఊరి పేరు మార్చాల్సిన అవసరం ఉందని స్పష్టంగా డిమాండ్ చేశారు.