|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 01:29 PM
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ, రాబర్ట్ వాద్రాల కుమారుడు రైహాన్ వాద్రా త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్నారు. తన చిరకాల స్నేహితురాలు అవివా బేగ్‌తో ఆయన నిశ్చితార్థం రాజస్థాన్‌లోని రణథంబోర్‌లో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఈ జంట సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫొటోల్లో రైహాన్ డార్క్ షేర్వాణీలో కనిపించగా, అవివా ఎంబెల్లిష్డ్ శారీలో మెరిసిపోయారు. తమ చిన్ననాటి ఫొటోను కూడా షేర్ చేస్తూ, తమ స్నేహం ఎంత పురాతనమైనదో వారు గుర్తుచేసుకున్నారు.అవివా బేగ్ ఢిల్లీకి చెందిన ప్రముఖ కుటుంబానికి చెందిన వారు. ఆమె తండ్రి ఇమ్రాన్ బేగ్ వ్యాపారవేత్త కాగా, తల్లి నందితా బేగ్ ఇంటీరియర్ డిజైనర్. నందితకు ప్రియాంకా గాంధీతో దశాబ్దాల కాలంగా మంచి స్నేహం ఉంది. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం 'ఇందిరా భవన్' ఇంటీరియర్ డిజైనింగ్‌లో కూడా ఆమె కీలక పాత్ర పోషించారు. అవివా ఢిల్లీలోని మోడరన్ స్కూల్‌లో చదివి, ఆ తర్వాత జర్నలిజం అభ్యసించారు. ప్రస్తుతం ఆమె కూడా ఇంటీరియర్ డిజైనర్‌గా, ఫొటోగ్రాఫర్‌గా రాణిస్తున్నారు.