|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 08:32 PM
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని వైపర్ కళాశాలలో శనివారం 'ఫ్రెషర్స్ డే' వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఫార్మసీ మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థులు సంగీతం, నృత్యాలతో ప్రేక్షకులను అలరించారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఏ. రమేష్ మాట్లాడుతూ, సీనియర్ విద్యార్థులు జూనియర్లకు చదువులో సహాయం చేయాలని, ర్యాగింగ్‌ను నివారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.