|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 02:20 PM
తెలంగాణలోని మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర 2026కు ముహూర్తం ఖరారైంది. జనవరి 19న అమ్మవారి గద్దెలు, ప్రాంగణ పునరుద్ధరణ ప్రారంభోత్సవం జరగనుంది. జనవరి 28న మహా జాతర ప్రారంభమై 31 వరకు నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది. 28న సారలమ్మ, 29న సమ్మక్క దేవత గద్దెకు ఆగమనం జరుగుతుంది. 30న భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారు. 31న సాయంత్రం 4 గంటలకు అమ్మవార్లు వన ప్రవేశం చేస్తారు.