|
|
by Suryaa Desk | Fri, Jan 09, 2026, 11:47 AM
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా ఓల్డ్ ఆల్వాల్ పరిధి, జొన్నబండలోని ఎంహెచ్ఆర్ కాలనీలో పార్కును హైడ్రా గురువారం కాపాడింది. 1444.40 గజాల పార్కు స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసింది. లే ఔట్ ప్రకారం సర్వే నంబర్లు 575, 576 (పార్ట్), 577, 578 (పార్ట్), 598 మరియు 580 (పార్ట్)లలో మొత్తం 1444.40 గజాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించారు. దీనిని ఆక్రమించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. హైడ్రాకమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారి ఆదేశాలమేరకు సంబంధిత అధికారులతో క్షేత్రస్థాయిలో హైడ్రా పరిశీలించింది. పార్కు స్థలంగా నిర్ధారించుకుంది. దీంతో గురువారం హైడ్రా ఫెన్సింగ్ వేసింది. ప్రజలకు ప్రాణవాయువును అందించే పార్కును కాపాడిన హైడ్రాకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. చెత్త వేయకుండా వెంటనే పార్కుగా అభివృద్ధి చేయాలని జీహెచ్ ఎంసీని కోరుతామన్నారు.