|
|
by Suryaa Desk | Thu, Jan 08, 2026, 10:35 PM
సంక్రాంతి పండుగలో గాలి పటాలు ఎగురవేయడం ఒక ఆనవాయితీగా మారింది. కానీ కొన్ని సార్లు గాలి పటాలు ఎగురవేయడానికి చైనీస్ మాంజా వాడకమవుతున్నది. తెలంగాణ ప్రభుత్వం 2016లో రాష్ట్రంలో చైనీస్ మాంజాను నిషేధించినప్పటికీ, చాలా వ్యాపారులు అక్రమంగా వీటిని అమ్ముతున్నారు.చైనీస్ మాంజా సాధారణంగా నైలాన్ లేదా సింథటిక్ తంతులతో తయారు చేస్తారు, ఇది పక్షులు, మనుషులు రెండింటికీ ప్రమాదకరం. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, హైదరాబాద్ సిటీ పోలీసులు చైనీస్ మాంజా విక్రయాలపై కఠిన చర్యలు చేపట్టారు.హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపిన వివరాల ప్రకారం, ఇ-కామర్స్ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కూడా నిఘా ఉంచి, 24 గంటలపాటు మానిటరింగ్ జరుగుతోంది. “చైనీస్ మాంజా అమ్మినా, వాడినా.. చట్టం ఊరుకోదు, లోపలేస్తది” అని ఆయన స్పష్టం చేశారు.సంక్రాంతి పండుగ వేళ నిషేధిత మాంజా విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. నగర వ్యాప్తంగా దాడులలో ఇప్పటివరకు 103 కేసులు నమోదు, 143 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ. 1.24 కోట్ల విలువైన 6,226 మాంజా బాబులు స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు ప్రజలను సచేతనంగా ఉండమని సూచిస్తున్నారు. ఎవరైనా తమ ప్రాంతాల్లో చైనీస్ మాంజా విక్రయాలు జరుగుతున్నట్లు గమనిస్తే, డైల్ 100 లేదా WhatsApp నంబర్ 9490616555 ద్వారా సమాచారం అందించాలని సూచించారు. ఈ చర్యలు ప్రాణనష్టాన్ని నివారించడంలో భాగస్వాములుగా మారాలని పోలీసులు కోరుతున్నారు.