|
|
by Suryaa Desk | Sat, Jan 10, 2026, 06:56 PM
సంక్రాంతి సెలవులు ప్రారంభం కాకముందే, సెకంద్రాబాద్, ఉప్పల్ ప్రాంతాల నుంచి ప్రజలు తమ గ్రామాలకు బయలుదేరడంతో ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి విజయవాడ హైవే వరకు వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు బస్సులు, కార్లు, ఆటోలు, బైక్‌లు కిక్కిరిసిపోయాయి. పలుచోట్ల వాహనాలు గంటల తరబడి కదలకుండా నిలిచిపోయాయి. సాధారణంగా పీక్ అవర్లలో కూడా ఈ మార్గంలో కొంత ట్రాఫిక్ ఉంటుందని, అయితే ఈసారి సంక్రాంతి సెలవుల కారణంగా పరిస్థితి మరింత తీవ్రంగా మారిందని ప్రయాణికులు తెలిపారు. ఉప్పల్ జంక్షన్, నాచారం, లిబర్టీ నుంచి వచ్చే మార్గాలన్నీ ఒకేచోట కలవడం వల్ల పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించడానికి ప్రయత్నించినా పెద్దగా ఫలితం లేకపోయింది.