|
|
by Suryaa Desk | Mon, Jan 12, 2026, 12:30 PM
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా పటాన్ చిరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని చిట్కుల్ గ్రామంలో వివేకానంద యూత్ వారి ఆధ్వర్యంలో పాల్గొని వివేకానందుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన పటాన్ చిరు మాజీ జేడ్పీటీసి గడీల శ్రీకాంత్ గౌడ్ గారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... "ఆత్మవిశ్వాసం సడలితే ఓటమి ప్రారంభమయినట్లే,ఆదే ఆత్మవిశ్వాసం మనలో నిబ్బరంగా ఉంటే విజయం మనల్ని వరించినట్లే" ఇలాంటి ఎన్నో సూక్తులు యువతకు అందించిన గొప్ప మహనీయుడు స్వామి వివేకానంద గారు అని అయిన కొనియాడారు . ప్రపంచ పటంపై భారత ఆధ్యాత్మిక కీర్తి పతాకాన్ని ఎగరవేయడంతోపాటు దేశ యువతలో ఎంతో స్ఫూర్తిని రగిలించారు వివేకానందుడు. దేశ యువత ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదో? ఆయన స్పష్టంగా తెలియజేశారు. వివేకానందుడి మాటలు, సూక్తులు ఇప్పటికీ, ఎప్పటికీ యువతకు మార్గనిర్దేశనం చేస్తూనే ఉన్నాయని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వివేకానంద యువజన సభ్యులు నవీన్,సంపత్,డప్పు ప్రశాంత్,డేగల నరేష్,మాజీ ఎంపీటీసీ నరేందర్ రెడ్డి,మాజీ ఉపసర్పంచ్ విష్ణు వర్ధన్ రెడ్డి,బ్యాగరి వెంకటేష్,అడ్వకేట్ నాగరాజు,మరియు గ్రామ యువకులు పాల్గొన్నారు