మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి వసతులను పరిశీలించారు. ప్రస్తుతం వర్షాకాలం ఉన్న నేపథ్యంలో పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్, ఎంఈఓ మంజుల దేవి, ఎంఎన్టి జగదీష్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa