హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2021 సంవత్సరంలో ధర్మాసనం ఇచ్చిన తీర్పును అమలు చేయడం లేదని ఓ పిటిషన్ దాఖలైంది.
అయితే చివరి క్షణంలో కోర్టు దృష్టికి తీసుకురావడం సరికాదని పిటిషన్‌ను కొట్టివేసింది. తీర్పును అమలు చేయకపోవడం తప్పేనని వ్యాఖ్యానించిన ధర్మాసనం చివరి క్షణంలో అడ్డుకోలేమని పేర్కొంది. దీంతో యదావిధిగా నిమజ్జనాలు కొనసాగనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa