ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయడం ఘోరం.. నేరస్థులను శిక్షించాలి: మోహన్‌బాబు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 21, 2024, 07:35 PM

తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై సినీనటుడు మోహన్‌బాబు స్పందించారు. "కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి నిత్యం సమర్పించే లడ్డూలలో కలిపే ఆవు నెయ్యిలో జంతువుల కొవ్వుని కలుపుతున్నారని తెలియగానే ఒక భక్తుడిగా తల్లడిల్లిపోయాను. ఆ స్వామి దగ్గర ఇలా జరగడం ఘోరం, పాపం, ఘోరాతి ఘోరం, నికృష్టం, అతినీచం, హేయం, అరాచకం. ఇదే నిజమైతే నేరస్థులను శిక్షించాలని నా ఆత్మీయుడు, నా మిత్రుడు ఏపీ సీఎం చంద్రబాబుని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను." అని ఓ ప్రకటన విడుదల చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa