ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరంగల్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 19, 2024, 04:17 PM

హైదరాబాద్‌:  వరంగల్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ప్రజాపాలన- ప్రజా విజయోత్సవాల్లో పాల్గొనేందుకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఆయన బయల్దేరి వెళ్లారు.ఈ నేపథ్యంలో 'ఎక్స్‌'లో ఆయన ఓ పోస్ట్‌ పెట్టారు.''తెలంగాణ చైతన్యపు రాజధాని.. కాళోజీ నుంచి పీవీ వరకు.. మహనీయులను తీర్చిదిద్దిన నేల.. స్వరాష్ట్ర సిద్ధాంతకర్త.. జయశంకర్ సార్‌కు జన్మనిచ్చిన గడ్డ.. హక్కుల కోసం వీరపోరాటం చేసిన సమ్మక్క - సారలమ్మలు నడయాడిన ప్రాంతం.. దోపిడీకి వ్యతిరేకంగా.. పిడికిలి బిగించిన చాకలి ఐలమ్మ యుద్ధ క్షేత్రం వరంగల్‌. వీరందరి స్ఫూర్తితో.. మనందరి భవిత కోసం వరంగల్‌ దశ-దిశ మార్చేందుకు నేడు వస్తున్నాను'' అని రేవంత్‌ పేర్కొన్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa