జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం శేకల్ల గ్రామ రైతు వేదికలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల ముందు రైతులు ఏ విధమైన పద్ధతులో వ్యవసాయం చేయాలనే సూచనలు రైతులకు తెలియజేయడం జరిగింది. వాతావరణ కాలుష్యం అనే విషయంపై, వరి కోయలు కాల్చకుండా డీకంపోజర్ పద్ధతులు మరియు పచ్చి రొట్టె విధానాన్ని రైతులందరూ పాటించి భూ సాంద్రత పెంచుకొని సరి అయినా పద్ధతులో వ్యవసాయం చేస్తే అధిక లాభాలు పొందవచ్చునని తెలిపారు.
సరి అయిన సమయంలో యాసంగి పంటకు కూడా సన్నపు వడ్ల క్రాప్ చేస్తే కూడా బాగుంటదని, ఈవానాకాలం పంటకు సన్న రకం వేసిన రైతులకు బోనస్ కూడా వెంట వెంట నెలలోపే అందే విధంగా కార్యక్రమం కూడా చేపట్టామని తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామ్ చందర్, ఏఈఓ శ్రీనివాస్ సొసైటీceo సుధాకర్ మరియు సంబంధిత అధికారులు బుగ్గారం మండల పలు గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.