కోదాడ లో ఈ నెల 14 న నిర్వహించే జాతీయ లోకదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో కోరారు. పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన కేసులను జాతీయ లోకదాలత్ ద్వారా రాజీ పెట్టుకోవచ్చని, రాజీ మార్గమే రాజమార్గం అన్నారు. కక్షీదారుడు జాతీయ మెగా లోక్అదాలత్ కు హాజరై కేసులను పరిష్కరించుకోవాలన్నారు. పోటీ పడితే ఒక్కరే గెలుస్తారని, రాజీ పడితే ఇద్దరు గెలుస్తారని పేర్కొన్నారు.