ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొని తెచ్చుకుంటున్న రోగాలు.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 14, 2024, 01:35 PM

కంగ్టి మండలం పరిసర ప్రాంతాల్లో పదికిపైగా మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌లు ఉన్నాయి. వీళ్లంతా నిబంధనలకు విడ్డురంగానే వాటిని నిర్వహిస్తున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. వీటిని పర్యవేక్షించాల్సిన అధికారులు మినరల్ వాటర్ పైన ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు.మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని ఆయా గ్రమంలో శుద్ధ జలం పేరిట కొందరు జోరుగా నీళ్ల వ్యాపారంతో ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో శుద్ధి నీటి వినియోగం ప్రజలకు నిత్యావసరమైంది. గ్రామాలలో ఎక్కువ మంది నేడు మినరల్‌ వాటర్‌నే తాగుతున్నారు. ప్రజల అవసరాన్ని ఆసరాగా తీసుకుంటున్న కొందరు వ్యాపారులు మినరల్‌ పేరుతో జనరల్‌ నీటిలో రసాయనాలు కలిపి సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. 
వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు బిఐఎస్‌ 
వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బిఐఎస్‌) అనుమతి తప్పనిసరిగా ఉండాలి. తొలుత పంచాయతీ నుంచి అనుమతులు తీసుకోవాలి. అనంతరం ప్లాంట్లో నీటిని మైక్రోబయాలజీ, కెమిస్ట్‌ నిపుణులు పరిశీలించాక అక్కడి నీరు శుద్ధజలమే అని వారు ధ్రువీకరించాలి. ఆ తర్వాతే ప్రజలకు సరఫరా చేయడానికి వారికి అనుమతి ఇస్తారు. మరోవైపు ప్లాంట్‌ నిర్వహణలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. పిహెచ్‌స్థాయి పదికి తగ్గకుండా చూడాలి. ప్రతిరోజూ నీటిని సరఫరా చేసిన క్యాన్‌లను పోటాషియం పర్మాంగనేట్‌తో శుభ్రంచేయాలి. నీటిలో లవణ ఖనిజాలు వంటి మినరల్స్‌ ఎంతశాతం ఉన్నాయో చూసుకున్నాకే ఆ నీటిని విక్రయించాలి.కానీ గ్రామీణ ప్రాంతలో మాత్రమే ఇలాంటి ఏమి పట్టకుండా బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ పర్మిషన్ కోసం కనీసం 20 లక్షలు నుండి 40 లక్షలు వరకు ఖర్చు అవుతుంది. కానీ  ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మినరల్ వాటర్ ప్లాంట్లను ఎదేచ్ఛగా నడుపుతున్నారు. తక్కువ ఖర్చుతో నాలుగైదు లక్షలుతో వాటర్ ప్లాంట్లను నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరు వస్తారని ధీమాతో ఎలాంటి పరిమిషన్ లేకుండా వాటర్ ప్లాంట్లను నిర్వహిస్తున్నారు.
ప్రజల ఆరోగ్యంతో చెలగాటం 
 కొంత మంది వాటర్ ప్లాంట్ నిర్వాహకులు నేరుగా నీటిని సరఫరా చేస్తూ సొమ్ము  చేసుకుంటున్నారని ఆరోపణ వస్తున్నాయి. వాటర్ ప్లాంట్ కేంద్రాల్లో నీటిని శుభ్రపరచకుండానే సరపర చేస్తున్నట్టు
తెలుస్తుంది. చాలా చోట్ల శుద్ధి చేయని నీటి క్యాన్లోనే నీళ్లను నింపుతూ ఇంటింటికి సరఫరా చేస్తున్నారు. రెండు, మూడు దశల్లో కడగాల్సిన నీటి డబ్బాలను కడగకుండానే ఆటో ట్రాలీలో ఉంచి వాటర్ నింపుతున్నారని తెలుస్తోంది. వాటిని హోటల్లో గృహ సముదాలకు  సరఫరా చేస్తున్నారు. అక్కడ నీటిని వాడేలోపు మరోరోజు నిల్వ ఉండడంతో నీటిలో సూక్ష్మజీవులు ఉత్పన్నమై తాగిన వారికి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇప్పటికే వైద్య నిపుణులు మినరల్ వాటర్ తాగడంతో మోకాళ్ల నొప్పులు వస్తూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎన్నో సందర్భాల్లో తెలియజేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఎంత మోతాదులో రసాయనాలు కలపాలో తెలియకపోవడంతో వారు చేసే తప్పిదాల వల్ల ప్రజలకు గొంతు కీళ్ల నొప్పులు శరీరం తేమ కూలిపోవడం, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.
మినరల్ వాటర్ ప్లాంట్ యజమానులు ప్రజల ఆరోగ్యంతో చెలగటం ఆడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వాటర్ పంటల ద్వారా నాణ్యమైన నీరు ప్రజలకు అందే విధంగా చర్య తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
అధికారుల నిఘా శూన్యం .. 
అనుమతి లేని వాటర్‌ప్లాంట్లను అరికట్టడంలో అధికారుల నిఘా శూన్యం . అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు మినరల్‌ వాటర్‌ తాగడం వల్ల అనేక జబ్బులు కొనితెచ్చుకుంటున్నారు. డబ్బే ప్రధాన లక్ష్యంగాని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ నిర్వాహకులను కట్టడి చేయాలని నీటి శుద్ధి ప్రక్రియ చేయకుండా నిర్వహిస్తున్న ప్లాంట్లను తనిఖీ చేసి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నాణ్యత ప్రమాణాలను అతిక్రమించి నిర్వహిస్తున్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa