ఉప్పునుంతల మండలంలో నేర నివారణ చర్యల్లో భాగంగా వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా సరైన ధ్రువపత్రాలు లేని 8 ట్రాక్టర్లు 6 ఆటోలు 15 ద్విచక్ర వాహనాలు మద్యం తాగి వాహనం.
నడిపిన ఇద్దరు డ్రైవర్ల పై ట్రాఫిక్ జరిమానాతో పాటు కేసులు నమోదు చేసినట్లు ఎస్సై వెంకట్ రెడ్డి ఆదివారం తెలిపారు. సరైన పత్రాలు వాహనాలకు నెంబర్ ప్లేట్లు లేకుండా లైసెన్సులు లేకుండా వాహనాల నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.