రాష్ట్ర ప్రభుత్వం హమాలీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ డిమాండ్ చేశారు. మంగళవారం కడ్తాల్ రైసు మిల్లు హమాలి కార్మికులు ఏఐటీయూసీ నుండి సీఐటీయూలో ఆయన సమక్షంలో చేరారు.
సంఘంలో చేరిన వారికి ఆయన కండువాలు కప్పారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హమాలీలకు ఇచ్చిన హామీలైన ఈఎస్ఐ, పిఎఫ్, ఇన్సూరెన్స్, పింఛన్, ప్రమాద బీమా అమలు చేయాలని కోరారు.