కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) విక్టర్ శనివారం భూ భారతి సర్వేకు సంబంధించిన డెస్క్ వర్క్ సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా, లింగంపేట్ మండలం పోతాయిపల్లి, నల్లమడుగు గ్రామాల్లో జరిగిన డెస్క్ వర్క్‌లను ఆయన పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు. భూ భారతి సర్వే కార్యక్రమం గ్రామస్థాయిలో పూర్తిగా సక్రమంగా జరగడం కోసం అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు విక్టర్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa