మొజిల్లా ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ వాడే వారికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అడ్వైజరీ జారీ చేసింది. ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌లో లోపం వల్ల సైబర్ నేరగాళ్లు యూజర్ల డేటాను దొంగిలించే ఛాన్సుందని తెలిపింది. యూజర్లు బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని, మొజిల్లా ఫైర్‌ఫాక్స్ వెర్షన్ 105, ఈఎస్‌ఆర్ వెర్షన్ వాడేవారు 102.3 వెర్షన్ కు అప్‌డేట్ చేసుకోవాలని చెప్పింది.